Site icon Prime9

Crime News : బీ టెక్ విద్యార్ధినిపై ప్రేమ పేరుతో ఒకరు.. బెదిరించి మరొకరు అత్యాచారం

Crime News about gang rape on btech student in ap

Crime News about gang rape on btech student in ap

Crime News : ఏపీలో తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నేటి సమాజంలో రోజురోజుకీ మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి తప్ప తగగడం లేదు అనడానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పాలి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతిని.. ప్రేమ పేరుతో నమ్మించిన యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు చూపించి మరో యువకుడు ఆమెను భయపెట్టి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువతి విజయవాడలో బీటెక్ చదువుతోంది. అదే మండలానికి చెందిన కృష్టారెడ్డితో ఆమెకు ఐదు నెలల క్రితం పరిచయమైంది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడడమే కాకుండా, ఆమెను నమ్మించేందుకు బ్లేడుతో చేతిని కోసుకున్నాడు. భయపడిన ఆమె అప్పటి నుంచి అతడితో చనువుగా ఉండడం మొదలుపెట్టింది. గత నెల 19న విజయవాడలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతికి ఫోన్ చేసిన కృష్ణారెడ్డి బెంగళూరు రావాలని, లేదంటే తమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించాడు. భయపడిన యువతి ఆ తర్వాతి రోజు బెంగళూరు వెళ్లింది.

అక్కడామెను తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి బెదిరించి నాలుగు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత అతడి నుంచి తప్పించుకుని సొంతూరు చేరుకుంది. 28న తండ్రితో కలిసి విజయవాడ బయలుదేరింది. తండ్రి ఆమెను గుత్తిలో వదిలి వెళ్లిపోయాడు. అదే సమయంలో గుంతకల్లుకు చెందిన దివాకర్ ఫోన్ చేసి బెంగళూరులో కృష్ణారెడ్డితో ఏకాంతంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, తాను చెప్పినట్టు వినకుంటే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

దీంతో అతడు చెప్పినట్టుగా గుంతకల్లు వెళ్లిన ఆమెను ఓ లాడ్జీకి తీసుకెళ్లిన దివాకర్ రెండు రోజులపాటు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెతో సన్నిహితంగా ఉండగా రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. అనంతరం వాటిని కృష్ణారెడ్డి సహా మరికొందరికి పంపాడు. బాధితురాలు గుంతకల్లు నుంచి విజయవాడకు వెళ్లిపోయింది. మరోవైపు, ఆ ఫొటోలు, వీడియోలు అదే మండలానికి చెందిన సుదర్శన్‌రెడ్డికి చేరడంతో ఆయన ఈ విషయాన్ని అమ్మాయి బంధువుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి ద్వారా విషయం తెలుసుకున్న బాధిత యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Exit mobile version