Site icon Prime9

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట..

court dismiss 2014 case against megastar chiranjeevi

court dismiss 2014 case against megastar chiranjeevi

Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై పెట్టిన కేసును ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. దాదాపు 9 ఏళ్ళ క్రితం గుంటూరు, అరండల్‌ పేట పోలీసులు నమోదు చేసిన కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేసింది. జరిమానా విధించాలన్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కే శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

2014ఎన్నికల సందర్భంగా చిరంజీవి ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా నియమాలు అతిక్రమించారని. రాత్రి 10 గంటల తరువాత ప్రచారం నిర్వహించకూడదు అనినియమం ఉన్నా కాని.. లెక్క చేయకుండా ప్రచారం నిర్వహించారని, ట్రాఫిక్‌ అంతరాయం కలిగించారని పేర్కొంటూ అప్పటి కాంగ్రెస్‌ నేత, సినీ హీరో చిరంజీవిపై గుంటూరు అరండల్‌ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేయగా గుంటూరు రైల్వే కోర్టులో విచారణ జరుగుతుంది. అదే సమయంలో పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, రైల్వే కోర్టులో విచారణ ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నిన్న (జులై25) విచారణకు వచ్చింది. మెగాస్టార్ తరఫున న్యాయవాది ఏ స్వరూపారెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్ట్ ఈ విధంగా తీర్పు ఇచ్చింది.

 

Exit mobile version