Site icon Prime9

GVMC: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ బదిలీపై వివాదం

Greater-Visakha-Municipal-Commissioner

Visakhapatnam: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ లక్ష్మిషా ఆకస్మిక బదిలీ వివాదంగా మారుతోంది. కొంత మంది వైసీపీ పెద్దలు కావాలనే కమిషనర్‌ను బదిలీ చేయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. రుషికొండ భూములు, దశపల్లా భూములను నిబంధనలకు విరుద్ధంగా కేటాయించలేదనే ఉద్దేశంతోనే కమిషనర్ లక్ష్మిషాను ట్రాన్స్‌ఫర్ చేయించారని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో వందల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మిషా బదిలీ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పి.రాజబాబును నియమిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత కమిషనర్ లక్ష్మీషాను ఏపీ అర్భన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా బదిలీ అయ్యారు

Exit mobile version