Site icon Prime9

Deputy CM Narayanaswamy: నాపై కుట్ర జరుగుతోంది.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి

AP-Deputy-CM-Narayana-Swamy

Andhra Pradesh: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలనవ్యాఖ్యలు చేశారు. పార్టీలో తన పై పై కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. అవినీతి చేశానని ఎవరైనా నిరూపిస్తే వాళ్ల కాళ్లు పట్టుకుంటానని అన్నారు. రేపు జగన్ ‎కు నాపై నిజంగా కోపం వచ్చే పరిస్ధితి ఏర్పడిందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్లు పార్టీని వదిలివెళ్లాలని ధ్వజమెత్తారు.

తన పై దుష్ప్రచారం చేస్తున్న మాయలో పడొద్దని పార్టీ శ్రేణులను కోరారు. తాను అవినీతి చేశానని, తప్పు చేశానని ఎవరైనా డైరెక్ట్‌గా చెబితే, వారికి సమాధానం చెబుతానని అన్నారు. తనను అవమానించిన విషయం చెబితే ఏమవుతుందో ఆ మనిషికి తెలియడం లేదని చెప్పుకొచ్చారు. అయితే పార్టీలో ఓ ముఖ్య నాయకుడిని ఉద్దేశించి నారాయణ స్వామి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.

Exit mobile version