Site icon Prime9

Recruitment: ఏపీ గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కారుణ్య నియామకాలు

Recruitment

Recruitment

Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రొబేషన్‌ పీరియడ్‌లో విధులు నిర్వహిస్తూ, మరణించిన వారి ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయనుంది. దీనికి సీఎం జగన్ అంగీకరించారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ అక్టోబరు 27న కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల ఆధారంగా కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రొబెషన్ పీరియడ్‌లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కూడా కారుణ్యనియామకాలు వర్తింపజేస్తూ సచివాలయాల శాఖ అక్టోబరు 27న జీవో నెంబర్ 7ను విడుదల చేసింది.

Exit mobile version