Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను ఓ కళంకిత అధికారిగా టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. సీఐడీ అనేది ఒక ధర్మపీఠం, అందరికీ సమానంగా న్యాయం చేయాల్సి ఉందని తెలిపారు. సునీల్ కుమార్ అధికారపక్షం కళ్లల్లో ఆనందం కోసం సీఐడీ చీఫ్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి తక్షణమే పీవీ సునీల్ కుమార్‌ను సీఐడీ చీఫ్‌గా తొలగించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సునీల్ కుమార్ మానసిక పరిస్థితి సజావుగా లేదన్నారు. సునీల్ కుమార్ కుటుంబ కలహాలతో కొట్టుమిట్టాడుతున్నారని, ఇలాంటి వ్యక్తికి సీఐడీ చీఫ్‌గా కొనసాగే అర్హత లేదని అన్నారు. జగన్ ప్రైవేటు సైన్యానికి అధ్యక్షుడిలా సునీల్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్, సజ్జల డైరెక్షన్‌లో సీఐడీ చీఫ్ చట్టవ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
హైదరాబాద్‌లో సీఐడీ చీఫ్‌పై కేసు ఉందని, అలాగే విజయవాడలో కూడా ఆయన సతీమణి 498(ఏ) కేసు పెట్టినట్లు తెలుస్తోందన్నారు. హైకోర్టులో కూడా సునీల్ కుమార్ పై తన అత్తమామలు వేధిస్తున్నారంటూ రిట్ పిటిషన్ కేసు వేశారని చెప్పారు. సొంత బావ పీవీ రమేష్ ను సునీల్ వేధించడం వల్లే పదవికి రాజీనామా చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. సీఐడీ చీఫ్‌తో సహా కళంకిత అధికారులందరినీ కోర్టు బోనులో నిలబెడతామని రామయ్య హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Minister Roja: ముదిరిన వర్గపోరు.. జగన్ కు మొరపెట్టుకొన్న మంత్రి రోజా