Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. తెదేపా పాలనలో నిర్మించిన వేలాది ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగారు. మా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఇవే అంటూ.. చాలెంజ్ విసిరారు.
సెల్ఫీ చాలెంజ్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. తెదేపా పాలనలో నిర్మించిన వేలాది ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగారు. మా ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఇవే అంటూ.. చాలెంజ్ విసిరారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో మీరు కట్టిన ఇళ్లులెన్ని చెప్పగలవా అంటూ సవాల్ విసిరారు. ఈ మేరకు ట్విట్టర్ లో జగన్ కు ట్యాగ్ చేస్తూ.. ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
వైసీపీ అరాచక పాలనను రాష్ట్రంలో అంతం చేయడానికి తెదేపా అడుగులు వేస్తోంది. తెదేపా పాలనలో చేసిన అభివృద్ధిని ఫోటోలు తీస్తూ.. సీఎం జగన్ కి ట్యాగ్ చేస్తున్నారు. తెదేపా పాలనలో జరిగిన అభివృద్ధి వైసీపీ పాలనలో జరగడం లేదని తెదేపా నేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు నెల్లూరులో నిర్మించిన.. టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద సెల్ఫీ దిగారు.
నాలుగేళ్ల పాలనలో ఇలాంటి ఇళ్ల సముదాయాన్ని ఒక్కటైన కట్టారని చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు తన ఫోన్ లో స్వయంగా సెల్ఫీ దిగారు. తెదేపా పాలనలో.. నాటి అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసరాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
సెల్ఫీ చాలెంజ్ టూ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ తో యువనేత నారా లోకేష్ సెల్ఫీలు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అదే తరహాలో చంద్రబాబు పోస్ట్ చేశారు.