Site icon Prime9

CM Jagan: ఎన్టీఆర్ పేరు పలకడం కూడ చంద్రబాబుకు ఇష్టం ఉండదు.. సీఎం జగన్

ys-jagan

Amaravati: ఎన్టీఆర్ పేరు పలకడం కూడ చంద్రబాబుకు ఇష్టం ఉండదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు పై జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తన కూతురిని గిఫ్ట్ గా ఇస్తే వెన్నుపోటును చంద్రబాబునాయుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని జగన్ సెటైర్లు వేశారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవకపోతే ఆయన ఆ టర్మ్ కూడా పూర్తి కాలం పాటు పదవిలో ఉండేవారేమోనన్నారు. ఎన్టీఆర్ బతికి ఉంటే చంద్రబాబునాయుడు ఏనాటికి కూడా సీఎం కాకపోయి ఉండేవారేమోననే అభిప్రాయాన్ని సీఎం గుర్తు చేశారు. ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు కంటే ఎన్టీఆర్ ను తాను ఎక్కువగా గౌరవిస్తానని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఎవరూ అడగకపోయినా కూడా విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరును ఎక్కడ పెట్టాలో చెబితే తాము ఎన్టీఆర్ పేరు పెడతామని ఈ విషయమై టీడీపీ సూచించాలని కోరారు. ఎవరు ఏ పనిచేశారో వారికి ఆ క్రెడిట్ దక్కాల్సిన అవసరం ఉందన్నారు.

హెల్త్ యూనివర్శిటీకి పేరు మార్చాలని నిర్ణయం తీసుకొనే ముందు తనను తాను చాలా సార్లు ప్రశ్నించుకున్నట్టుగా ఏపీ సీఎం చెప్పారు. బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకన్నామని వైఎస్ జగన్ తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం కంటే ముందే మూడు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మూడు మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారన్నారు. తాను సీఎంగా ఎన్నికయ్యాక మరో 17 కాలేజీలు రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీడీపీ హయంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు కాలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. టీడీపీ సభ్యులు గొడవ చేయాలనే అసెంబ్లీకి వచ్చారని సీఎం చెప్పారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు కూడా ఉంటే ఎందుకు వైఎస్ఆర్ పేరును హెల్త్ యూనివర్శిటీకి పేరు పెట్టాల్సి వచ్చిందో అర్ధమయ్యేదన్నారు.

 

Exit mobile version