Site icon Prime9

Viveka Murder case: వివేకా హత్య కేసులో మరోసారి అవినాష్ కు సీబీఐ నోటీసులు

YS Avinash

YS Avinash

Viveka Murder case: వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పుటికే రెండుసార్లు విచారణకు అవినాష్ రెడ్డి గైర్హజరయ్యారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంతో.. ఉత్కంఠ మళ్లీ మెుదలైంది. ఈ నోటీసులపై అవినాష్ ఎలా ముందుకెళ్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

మరోసారి నోటీసులు..

వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పుటికే రెండుసార్లు విచారణకు అవినాష్ రెడ్డి గైర్హజరయ్యారు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంతో.. ఉత్కంఠ మళ్లీ మెుదలైంది. ఈ నోటీసులపై అవినాష్ ఎలా ముందుకెళ్తారనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఈ నెల 22న ఉదయం హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా నోటీసులు జారీ చేశారు.

అంతకు ముందు జారీ చేసిన నోటీసుల ప్రకారం.. శుక్రవారమే సీబీఐ ఎదుట హాజరుకావాల్సి ఉంది.

అయితే నాటకీయ పరిణామాల నేపథ్యంలో అవినాష్ విచారణకు హాజరు కాలేదు. చివరి నిమిషంలో తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని.. పులివెందుల వెళ్లిపోయారు.

పులివెందలు వెళ్తున్న క్రమంలో.. సీబీఐ అధికారులు అవినాష్ ను కొంతదూరం వెంబడించడం తీవ్ర చర్చనీయంశమైంది.

మరోసారి విచారణ తేదీ ఇవ్వాలని ఈ మేరకు అవినాష్ రెడ్డి న్యాయవాదులు సీబీఐని కోరారు. దీంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ.

శుక్రవారం రాత్రి.. అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మకు గుండెపోటు వచ్చిందని.. ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చేర్పించారు.

అయితే తన తల్లి అనారోగ్యం పాలవడంతో.. విచారణకు ఆయన హాజరు కాలేరని న్యాయవాది ద్వారా సమాచారం అందించారు.

హైదరాబాద్‌ నుంచి పులివెందుల వెళ్తున్న క్రమంలో.. సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డి వాహనాన్ని వెంబడిస్తున్నారని ప్రచారం జరిగింది.

ఒకవేళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సీబీఐను అడ్డుకోవాలనే వ్యూహంలో భాగంగానే ఎక్కడికక్కడ వైకాపా శ్రేణులను మోహరించారన్న ప్రచారం జరిగింది.

దీంతో కొన్ని గంటలపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Exit mobile version