Pulivendula: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటనలో సీబిఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. కొంతకాలంగా స్ధబ్దుగా ఉన్న సీబిఐ విచారణ తిరిగి ఊపందుకొనింది. ఈ క్రమంలో పులివెందులకు సీబిఐ అధికారుల బృందం చేరుకొనింది. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో డ్రైవర్ దస్తగిరి, భార్య షబానాను ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రొద్దటూరు మెజిస్ట్రేట్ ఎదుట కీలక సమచారాన్ని దస్తగిరి ఇచ్చివున్నాడు. ఈ క్రమంలో దస్తగిరిని బెదిరించిన వ్యక్తుల పై ఆరా తీసేందుకు సీబిఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కీలక సమాచారాన్ని ఫోన్ నెంబర్ల ద్వారా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వివేకా హత్యలో కోట్లాది రూపాయల ఒప్పందం కుదుర్చుకొన్న నేపద్యంలో దస్తగిరి వాగ్మూలం కీలకమైంది. ఇప్పటికే వివేకా పీఏ, కంప్యూటర్ ఆపరేటర్ ను సీబిఐ విచారించివుంది.
వివేక కూతురు సునీత సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ నేపద్యంలో సీబిఐలో కదలిక వచ్చిందని చెప్పాలి. కేసు పై రాష్ట్ర ప్రభుత్వం ఉదాశీనతనంగా వ్యవహరిస్తుందని, సీబిఐ అధికారులపై సైతం పోలీసులు కేసులు పెడుతున్నారని, కేసును ఏపి నుండి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న సునీత అభ్యర్ధనపై అక్టోబర్ లో కోర్టు విచారించనుంది. ఈ నేపద్యంలో సీబిఐ వివేక హత్యపై విచారించేందుకు సీబిఐ దూకుడు పెంచింది.