Site icon Prime9

Dalit Women : ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన.. దళిత వివాహితపై కళ్ళల్లో కారం కొట్టి విచక్షణ రహితంగా దాడి.. వివస్త్రను చేసి !

brutal attack on dalit women in prakasam district and turned her into nude

brutal attack on dalit women in prakasam district and turned her into nude

Dalit Women : ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఓ దళిత వివాహితపై దాడి జరిగింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మనుష్యులు కానీ మనుషులు.. అర్ధరాత్రి సుమారు 12.30 గంటల సమయంలో తెల్లవారితే స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే సందర్భంలో తమ కుమార్తె వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి ఇంట్లో వెళ్లిపోయిందనే కోపంతో అతడి సోదరిపై విచక్షణ రహితంగా ఓ మహిళపై దారుణంగా దాడి చేసి.. కళ్లలో కారం కొట్టి.. కత్తులతో విరుచుకుపడి.. దాడి  చేసి.. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళి.. హింసించి , వివస్త్రను చేసి ట్రాక్టర్ కి కత్తివేసి చిత్ర హింసలు పెట్టి.. చివరికి చంపడానికి కూడా సిద్దపడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా సదరు యువతి ప్రైవేట్ పార్ట్స్ లో రాడ్లు, కర్రలు పెడతామంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు కొందరు మూర్ఖులు.. ఈ ఘటన అంతటిలో ఆ దుండగులకు ఓ మహిళా కూడా సహకరించి.. ఎదుట ఉన్నది కూడా మహిళే అనే కనీసం ఇంగీత జ్ఞానం లేకుండా ప్రవర్తించారు అంటే వారిని ఏం అనాలో.. వారి గురించి ఏమి రాయలో మాటలు కూడా రావట్లేదు. ప్రస్తుతం బాధితురాలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.

కాగా ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో జరిగిన ఈ ఘటనలో ఇంతటి దారుణానికి వాళ్ళు ఒడిగట్టడానికి కారణం ఏంటంటే.. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంటిపెద్ద చాన్నాళ్ల క్రితమే మరణించారు. కుమార్తెకు పదేళ్ల క్రితం వివాహం కాగా రెండేళ్ల క్రితం భర్త చనిపోయారు. ఆమె నర్సు శిక్షణ తీసుకుని ప్రైవేట్‌ వైద్యశాలలో పనిచేస్తున్నారు. అయితే ఆమె సోదరుడు అదే గ్రామంలో వేరే కులానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కుమార్తె ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు ఇంట్లో ఎలాగూ ఒప్పుకోరనుకున్నారో, ఏమో.. వీరిద్దరూ ఆరు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చి తాము కులాంతర వివాహం చేసుకున్నందున రక్షణ కల్పించాలంటూ కోరారు. తమ కుటుంబంపై దాడి చేస్తారని తెలిపారు. ఆ తర్వాత ఊరు నుండి వెళ్ళిపోయారు. అప్పటినుంచి ఆ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలో సోమవారం రాత్రి మున్సిపల్ నీళ్లు పట్టుకుంటున్న సాయిరాం తల్లి, చెల్లెలు మౌనికపై బ్రహ్మారెడ్డి కుటుంబం దాడికి దిగింది. యువతి తల్లి కళ్లలో కారం కొట్టి.. యువతి మీద దాడి చేశారు. నడిరోడ్డులో యువతి బట్టలు విప్పేసి వివస్త్రను చేసారు. అలాగే ఇంటిదాకా ఈడ్చుకు వెళ్లారు. ఆ తర్వాత ఆమెను చంపడానికి ప్రయత్నించారు. బ్రహ్మారెడ్డి భార్య అది ఆపి.. ఆమెను అలాగే నగ్నంగా ట్రాక్టర్ కు కట్టేయాలని, హింసించాలని సూచించింది. దీంతో వారు అలాగే చేశారు. పరుషమైన పదజాలంతో.. హింసిస్తూ.. తీవ్రస్థాయిలో దూషిస్తూ భయాందోళనలు సృష్టించారు. అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారు. ఆమె సోదరుడు, వారి కుమార్తె ఎక్కడ ఉంటున్నారని, వారి అడ్రస్ చెప్పాలంటూ బెదిరించారు.

అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ దారుణం చోటుచేసుకుంది. దళిత వితంతు మహిళ పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని చూసిన గ్రామస్థులు 100 కు ఫోన్‌ చేసి చెప్పారు. ఈ సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకొని బ్రహ్మారెడ్డి ఇంట్లో బందీగా ఉన్న బాధితురాలిని గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆమె కాళ్లూ చేతులకు ఉన్న కట్లు విప్పి.. వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాల మేరకు అపహరణ, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు బ్రహ్మారెడ్డిని, అతడి భార్య పుల్లమ్మను అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనపై ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిందితులని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Exit mobile version
Skip to toolbar