Site icon Prime9

Balakrishna: వరద బాధితులను పరామర్శించిన బాలకృష్ణ

Balakrishna visited the flood victims

Balakrishna visited the flood victims

Hindupur: ఏపీలో ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు అతాకుతలం చేశాయి. హిందూపూర్, అనంతపురం, కదిరి ప్రాంతాల ప్రజలు జలదిగ్భందంలో చిక్కుకుపోయారు. లోతట్టు కాలనీ ప్రజలు, గ్రామాలు ఆహారం కోసం అల్లాడారు. దీంతో ప్రభుత్వంతో పాటు పలువురు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. నటుడు, హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ వరద బాధితులను పరామర్శించారు.

కుట్మూరు చెరువు పొంగడంతో పాటు వరద ఉధృతికి హిందూపురం నుండి అనంతపురం, కదిరి ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలదిగ్భంధంలో చిక్కుకున్న చౌడేశ్వరి కాలనీ ప్రజలను బాలకృష్ణ పరామర్శించారు. మోకాలు లోతున్న ఉన్న నీటిలో వారి వద్దకు చేరుకొన్న బాలకృష్ణకు స్థానికులు వర్షాభావ ప్రభావంతో నెలకొన్న ఇబ్బందులను చెప్పుకొన్నారు. సాగుచేసిన పంటల నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పేర్కొన్న సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తామని బాలకృష్ణ వారికి హామీ ఇచ్చారు.

తెదేపా కార్యకర్తలు, నేతలంతా కలిసి ముంపుకు గురైన చౌడేశ్వరి కాలనీ, త్యాగరాజ నగర్, ఆర్టీసి కాలనీవాసులకు త్రాగునీరు, భోజనాలు సమకూర్చారు.

ఇది కూడా చదవండి:  కట్ట తెగిపోతుంది జాగ్రత్త.. అప్రమత్తం పై అనంతపురం అధికారుల మెసేజ్

Exit mobile version