Balakrishna Mass Warning : నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డికి బాలయ్య మాస్ వార్నింగ్ ఇచ్చారు. పొలిటీషియన్ పొలిటీషియన్‌గానే ఉండాలని సూచించారు. నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాసరెడ్డిని ఘాటుగా హెచ్చరించారు. ఈ సందర్భంగా తాజాగా ఓ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించడం ఏంటని మండిపడ్డారు. సదరు ఎమ్మెల్యే పేరు చెప్పకుండానే ఆయనపై ఆగ్రహించారు. సినిమాను సినిమాగానే చూడాలన్నారు. ఇంకోసారి ఇలాంటి ఘటన జరిగితే ఊరుకోనని చెప్పారు. ‘మొన్న నరసరావు పేటలో చిన్న సంఘటన జరిగింది. బాలకృష్ణ పాట వేశారంటూ వాళ్ల కార్యకర్తనే ఇబ్బంది పెట్టారు. అంతకంటే మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటారా. యథా రాజ తథా ప్రజా. స్థాయి దిగజార్చుకున్న ఆ వ్యక్తి పేరు నేను తీయను. ఇంకోసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఊరుకోను.
మీ పరిధిలో మీరు ఉండండి అంటూ హెచ్చరించిన బాలయ్య (Balakrishna Mass Warning)..
నేను చిటికేస్తే, మూడో కన్నుతెరిచానంటే చూస్కోండి జాగ్రత్త. రాజకీయ నాయకుడిగా నాపైకి వస్తానంటే రండి. నేను రెడీ. కానీ, సినిమాల విషయానికి రావొద్దు. మీ పరిధిలో మీరు ఉండండి’ అని బాలకృష్ణ హెచ్చరించారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా పద్దతి మార్చుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సూచించారు బాలయ్య.
ఇంతకీ ఏం జరిగింది అంటే..
కొద్ది రోజుల క్రితం ప్రభ ఊరేగింపు సందర్భంగా… వైసీపీ నేత భాస్కర్‌రెడ్డి బాలకృష్ణ పాట పెట్టాడు. అందుకు గాను ఆపై అతడిని ఎమ్మెల్యే వేధించినట్లు ప్రచారం జరిగింది. అనంతరం భాస్కర్‌రెడ్డి.. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇప్పుడు ఆ ఘటనపైనే శ్రీనివాసరెడ్డికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇంత నీచానికి దిగజారడం ఏంటని బాలయ్య ప్రశ్నించారు.
కాగా ఇటీవలే ఎమ్మెల్యే ఇంటి ముందు సదరు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. నమ్మిన వైసీపీ నేతలే తనను దారుణంగా మోసం చేసారని ఆరోపించాడు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రభా వద్ద ఆ ఘటన జరిగినప్పటి నుంచి భాస్కర్ రెడ్డిని ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి వేధిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. సదరు వ్యక్తిని సొంత పార్టీ నేతలే దూరం పెడుతున్నారని.. పార్టీ కోసం అహర్నిశలు పని చేసే భాస్కర్ రెడ్డి లాంటి కార్యకర్త పట్ల ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/