Site icon Prime9

Chandrababu Naidu: చంద్రబాబు కాన్వాయి పై దాడి.. భద్రతా సిబ్బందికి గాయాలు

Attack on Chandrababu's convoy...Security personnel injured

Andhra Pradesh: నందిగామ పర్యటనలో ఉన్న తెదేపా జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయి పై గుర్తు తెలియని వ్యక్తి రాయిని విసిరాడు. దీంతో ఉద్రికత్తత నెలకొనింది. బాదుబే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నిరసన షో చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొనింది. చంద్రబాబు ప్రధాన భద్రతాధికారి మధుబాబుకు గాయాలైనాయి. ముఖం మీద గాయ అవడంతో వెంటనే వైద్యులు ప్రాధమిక చికిత్స అందించారు. తన పర్యటనలో పోలీసు భధ్రత సరిగా లేకపోవడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా గూండాలు ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. వైసిపి రౌడీలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: Chandrababu Naidu: ఎవ్వరినీ బతకనివ్వరా, పవన్ ఇంటి వద్ద రెక్కీ పై చంద్రబాబు స్పందన

Exit mobile version