Amaravati: ఏపీ ప్రభుత్వం కు హైకోర్టులో స్టేలు, మొట్టికాయలు కామన్ అయిపోయాయి. ప్రభుత్వ పనితీరు పై అభ్యంతరాలు, ఇచ్చిన జీవోల్లో అవకతవకలు. ఇలా గడిచిన మూడు సంవత్సరాల్లో ప్రజల ప్రభుత్వంగా చెప్పుకొనే జగన్ సర్కార్ కు అనేక సార్లు కోర్టు మందలించింది. తాజాగా ఓ కేసు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో అమల్లోను 6వారాల పాటు నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విస్తరణ నియామకాలను చేపట్టేందుకు 560 మంది విస్తరణ అధికారుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్షలు నిర్వహించి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్‌ను సర్కార్ నిలిపేసింది. ముందుగా కొందరు అభ్యర్థులను ఎంపిక చేసుకుని, వారికే లాంగ్వేజ్ టెస్ట్ పెట్టారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పిటిషనర్ తరపున న్యాయవాది వాదిస్తూ విస్తరణ అధికారి నియామకానికి రూ.10 లక్షలు వసూలు చేశారని కోర్టుకు తెలిపారు. అర్హులకు అన్యాయం జరుగుతోందని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.
వాదనలు విన్న న్యాయస్థానం. అన్ని జోన్‌లలో నియామక ప్రక్రియ పై స్టే విధించింది. 6 వారాల్లో స్టే వెకేషన్ అనంతరమే నియామక ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: ఏపీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మృతివనం