AP Weather: మాండూస్ తుఫాను మరువకముందే ఏపీకి ముంచుకొస్తున్న మరో అల్పపీడనం..!

మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీపై ఇంకా కనిపిస్తోంది. తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావం మాత్రం బలంగానే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో వందల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పటికే మాండూస్ తుఫాను నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో అల్పపీడన ముప్పు ఏపీని ముంచుకొస్తుంది.

AP Weather: మాండూస్ తుఫాన్ ఎఫెక్ట్ ఏపీపై ఇంకా కనిపిస్తోంది. తీరం దాటి బలహీనపడినప్పటికీ దాని ప్రభావం మాత్రం బలంగానే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో వందల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతులు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఇప్పటికే మాండూస్ తుఫాను నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో అల్పపీడన ముప్పు ఏపీని ముంచుకొస్తుంది.

ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ టోపోస్పిరిక్ ఆవరణములో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం తీరానికి అనుకుని ఉన్న మలక్కా, సుమత్రా జలసంధి వద్ద గల ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది. దీని ప్రభావంతో గురువారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా శ్రీలంక తీరం వైపు కదులుతుందని.. దాని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది.

ఏపీని మాండూస్ తుఫాను వణికించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తీవ్రంగా నష్టం ఏర్పడింది. పుత్తూరు, నగరిలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు మంత్రి రోజా. ఇక పుత్తూరు రైల్వే స్టేషన్ వద్ద వర్షం తాకిడికి పలు ఇళ్లు కూలిపోయాయి. తిరుపతి-తిరుమల క్షేత్ర మెట్ల దారిని సైతం తుఫాను వణికించేసింది. భారీ వర్షంలోనే తడుస్తూ దర్శనానికి వెళ్లారు శ్రీవారి భక్తులు.
కొండ మీద నుంచి కుండపోతగా వచ్చిన నీటితో కపిల తీర్థం నిండా మునిగింది. భారీ వర్షంతో రైతులకు అపార నష్టం మిగిలింది. పొలాల్లో ఆరబోసుకున్న వరి ధాన్యం తడిసి ముద్దయిపోవడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ దీనంగా వేడుకుంటున్నారు.

సీఎం ఆదేశాలు మేరకు భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టారు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని సీఎం హామి ఇచ్చారు. దీని ప్రభావం నుంచి ఇప్పుడిపపుడే బయటపడుతుంటే.. ఈ లోపే మరో అల్పపీడనం ముప్పు ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి: వృద్ధులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్… జనవరి 1నుంచి వృద్ధాప్య పెన్షన్ల పెంపు..!