Amaravati: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దూకుడు పెంచారు. ఈ సారి 175 సీట్లకు 175 గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 2024 లో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రీపెర్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీల పై ఫోకస్ పెట్టి, టీడీపీ అధినేత ఐనా చంద్రబాబు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపీ జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించిన విషయం మనకి తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంపైనా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలిసిన సమాచారం. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత గంజి చిరంజీవిని వైఎస్సార్‌సీపీలో చేరగా, పార్టీలో చేరినా కొద్ది కాలంలోనే ఆయనకు చేనేత విభాగం పదవి కూడా అప్పగించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ ద్వారా మంగళగిరి నియోజవర్గానికి సంబంధించిన నిధులను వెల్లడించారు. ప్రభుత్వం ఈ నియోజవర్గానికి మొత్తం రూ.137.11 కోట్లను విడుదల చేసింది. ఈ సంధర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిధులను సీసీ, బీటీ రోడ్లు వేయడానికి, సీసీ డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణ పనుల కోసం ఈ నిధులు కేటాయించనున్నారని జీవీలో పేర్కొన్నారు.