YSR Cheyutha Scheme 2022: వైఎస్ఆర్ చేయూత పథకం

ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ వరుసగా నాలుగో ఏడాది సంక్షేమ పథకాలను అమలు చేసింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం లబ్దిదారుల అకౌంట్‌లలో జమ చేస్తోంది. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం నేరుగా లబ్దిదారుల అకౌంట్‌లలో డబ్బును జమ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - August 26, 2022 / 10:20 AM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ వరుసగా నాలుగో ఏడాది సంక్షేమ పథకాలను అమలు చేసింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం లబ్దిదారుల అకౌంట్‌లలో జమ చేస్తోంది. తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యింది. సంక్షేమ పథకాల క్యాలెండర్ ప్రకారం నేరుగా లబ్దిదారుల అకౌంట్‌లలో డబ్బును జమ చేస్తోంది.

45 ఏళ్లు నిండిన మహిళా అక్క చెల్లెమ్మలకు జగనన్న వైఎస్సార్‌ చేయూత పథకం ప్రవేశ పెట్టాడు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళకు ఆర్థిక సహాయం అందజేసేందుకు జగన్ సర్కార్ సిద్దమైంది. ఈ పథకానికి అర్హులైన మహిళలకు (ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు నిండిన వారికి) ఈ పథకం వర్తిస్తుంది. అర్హత గల మహిళలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేర్ల నమోదుతో పాటు దరఖాస్తుల స్వీకరణ కూడా జారుతుంది.

సెప్టెంబర్‌ 5వ వరకు పేర్ల ఈ నమోదు ప్రక్రియ చేసుకోవడానికి సమయం ఉంటుంది. అర్హులైన వారికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా రూ.18,750 చొప్పున నాలుగు విడతల్లో రూ.75 వేలు లబ్దిదారుల అకౌంట్‌లలో డబ్బును జమ చేస్తోంది. ప్టెంబర్‌ 5 వరకు కొత్తగా అర్హత పొందిన వారు, వారి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ దరఖాస్తులపై సెప్టెంబర్ 8 లోగా సచివాలయ సిబ్బంది, ఎంపీడీవోల ఆధ్వర్యంలో పరిశీలనను పూర్తి చేస్తారు. అలాగే కొత్తగా అప్లై చేసుకునే వారు, పేర్ల నమోదు ప్రక్రియకు కుల ధ్రువీకరణ పత్రం మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి.