AP EAPCET Counselling 2022: ఏపీలో ఈ ఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రక్రియను కన్వీనర్ పోలా భాస్కర్ షెడ్యూల్ ప్రక్రియను ఆగష్టు 22న విడుదల చేసారు. ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకు సంబంధించిన ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇంకా కౌన్సెలింగ్ వెళ్ళని వాళ్ళు కౌన్సిలింగ్ కు హాజరుకండి. మరో నాలుగు రోజులు మాత్రమే ఈ కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు నోటిఫికేషన్ జారీ చేసారు. రాష్ట్రవ్యాప్తంగా 25 సహాయక కేంద్రాల్లో ఈ కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ ఏపీసెట్‌లో మొత్తం 1,73,572 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ జరుగుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు అనంతరం ఫార్మసీ విద్యార్థులకు కౌన్సిలింగ్ జరుగుతుంది. విద్యార్థులు పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్ మీద క్లిక్ చేసి చూడవచ్చు https://eapcet-sche.aptonline.in/EAPCET/
ఏపీలో ఈ ఏపీసెట్ కౌన్సెలింగ్ జరిగే ముఖ్య తేదీలు :
ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీ : ఆగస్టు 22 – 30 వరకు
సర్టిఫికెట్ల పరిశీలన తేదీ : ఆగస్టు 23 – 31వరకు
కాలేజీలు, కోర్సుల ఎంపికకు ఆప్షన్ల నమోదు తేదీ : ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 2 వరకు
ఆప్షన్లలో మార్పు తేదీ : సెప్టెంబరు 3న
సీట్ల కేటాయింపు తేదీ : సెప్టెంబరు 6న
కాలేజీల్లో రిపోర్టింగ్ తేదీ : సెప్టెంబరు 6 – 12 వరకు
క్లాసులు ప్రారంభం తేదీ : సెప్టెంబరు 12 నుంచి క్లాసులు జరుగుతాయి.