Site icon Prime9

CM Jagan: చంద్రబాబు అడ్డాలో జగన్ టూర్ ఫిక్స్

cm-jagan-tour to nellore dist

cm-jagan-tour to nellore dist

Andhra Pradesh: కుప్పం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. ఏళ్ల తరబడి గెలుస్తూ వస్తున్న నియోజకవర్గం. బాబు ఇక్కడ ఎన్నికల సమయంలో నామినేషన్ మాత్రం వేసి వెళ్లిపోతారు. ప్రచారం, పోలింగ్ అంతా స్దానిక నేతలే చూసుకుంటారు. అటువంటి కుప్పం పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్ను పడింది. బాబు ఇలాకాలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్నారు.

అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో పలు అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కాదు ఇప్పుడు కుప్పంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కుప్పం రానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కుప్పం మునిసిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు సీఎం హాజరవుతున్నట్లు పార్టీ కీలక నేతలు వెల్లడించారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పలు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ హెలికాప్టర్‌లో కుప్పంకు రానున్న నేపథ్యంలో ఇరు నేతలు హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు.

కుప్పం మునిసిపాలిటీతో పాటు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అత్యధిక సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దాంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం సీటును కూడా కైవసం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఉవ్విళ్లూరుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం పైనే పూర్తి దృష్టి సారించారు. రీసెంట్ గా చంద్రబాబు కుప్పంలో పర్యటించగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అన్న క్యాంటిన్ ను ధ్వంసం చేయడం, టీడీపీ ప్లెక్సీలు కాల్చేయడం, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటివి వైస్సార్సీపీ కార్యకర్తలు చేసారు. అందుకే ఇప్పుడు జగన్ పర్యటన పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Exit mobile version