Site icon Prime9

AP Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిపికేషన్

ap-speaker

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు శుక్రవారం నాడు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి సాయంత్రం వరకు డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది. సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి గురువారం నాడు రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ నిన్ననే ఆమోదించారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవిని మరొకరికి కేటాయించాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. ఈ పదవిని విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి కేటాయించే అవకాశముంది.

Exit mobile version
Skip to toolbar