Site icon Prime9

AP Assembly Sessions : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. గవర్నర్ కి స్వాగతం పలికిన అధికార, ప్రతిపక్ష నేతలు

ap assembly sessions started and welcomes governor nazeer

ap assembly sessions started and welcomes governor nazeer

AP Assembly Sessions : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం నాడు తాజాగా ప్రారంభమయ్యాయి. ఏపీ రాష్ట్ర గవర్నర్ గా అబ్దుల్ నజీర్ ఇటీవలనే బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అబ్దుల్ నజీర్ ఇటీవలనే రిటైర్ అయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైన వెంటనే ఏపీ గవర్నర్ గా నజీర్ ను నియమిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏపీ గవర్నర్ గా పనిచేసిన బిశ్వభూషన్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ కు రాష్రపతి బదిలీ చేశారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించేందుకు అసెంబ్లీకి వచ్చిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్, శాసనమండలి చైర్మెన్.. శాసనసభ స్పీకర్, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. గవర్నర్ ను అసెంబ్లీ లోపలికి సాదరంగా తీసుకువచ్చారు. అసెంబ్లీ లోపలికి అడుగుపెట్టిన గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. మహిళల భద్రతకు, సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటా, మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరుగుతోందని, అర్హులకు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధి చేకూరుతుందని జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చెప్పారు.

 

ఏపీలో నాలుగేళ్లుగా సుపరిపాలన – గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Assembly Sessions)

రాష్ట్రంలో నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ముందడుగు వేసిందని, వ్యవసాయంతో పాటు మిగతా రంగాల్లోనూ ప్రగతిపథంలో నడుస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జీడీపీ వృద్ధి 11.43 శాతంగా నమోదైందన్నారు. 2020-21 ఏడాదిలో జీడీపీ వృద్ధికి సంబంధించి ఏపీ దేశంలోనే ముందంజలో ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.

కాగా నీటిపారుదల రంగంపై మాట్లాడుతూ పోలవరం, పూల సుబ్బయ్య  వెలిగొండ ప్రాజెక్టు  వంటి  ప్రాజెక్టులు  పురోగతిలో  ఉన్నాయని  గవర్నర్  చెప్పారు. అయితే గవర్నర్‌ ప్రసంగిస్తుండగా తెదేపా సభ్యులు నిరసన తెలిపారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ప్రాజెక్టులను పూర్తి చేశారో చెప్పాలని నినాదాలు చేశారు. ప్రాజెక్టుల అంశంపై  ప్రభుత్వం అబద్దాలు చెబుతుందని  టీడీపీ సభ్యులు  చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. ఆ తర్వాత గవర్నర్ తన ప్రసంగాన్ని యథావిధిగా కొనసాగించారు. ప్రసంగం అనంతరం ప్రభుత్వ తీరును నిరసిస్తూ  గవర్నర్ ప్రసంగాన్ని  బాయ్ కాట్  చేస్తున్నట్టుగా  టీడీపీ సభ్యులు ప్రకటించి సభ నుంచి వాకౌట్ చేశారు.

ఏపీ రాష్ట్రానికి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నజీర్ ను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నిన్న మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version