Site icon Prime9

AP assembly: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ap-assembly

Amaravati: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రేపటి (సెప్టెంబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలి రోజే ప్రభుత్వం మూడు రాజధానుల పై శాసనసభలో స్వల్పకాలిక చర్చను పెట్టే అవకాశం ఉంది.

మూడు రాజధానులపై సభలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విధంగా మూడు రాజధానులతో ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో జగన్ ఉన్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ప్రభుత్వం. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల పై కొత్త బిల్లును ప్రవేశపెట్టనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

జగన్ సర్కార్ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. మంత్రులు కూడ ప్రతీ చోటా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. విశాఖపట్నం (పరిపాలన రాజధాని), అమరావతి (శాసన రాజధాని), కర్నూలు (న్యాయ రాజధాని), మూడు రాజధానులకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రూ. 1.09 లక్షల కోట్ల భారీ వ్యయంతో 53,000 ఎకరాలను అభివృద్ధి చేయాలనే ప్రణాళికను రూపొందించిందని, అయితే ఈ ప్రక్రియ అంతా అవినీతితో కూడుకున్నదని జగన్ ఆరోపించారు.

Exit mobile version