Amaravati: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నేడు ఉదయం 9 గంటలకు నుంచి అసెంబ్లీ ప్రారంభమవ్వనుంది. బీఏసీ సమావేశంలో సమావేశాలు ఎన్నిరోజులు జరగాలి. అసెంబ్లీలో చర్చిలించాలిసిన అంశాలను గురించి నిర్ణయం తీసుకోనున్నారు. మొదటి రోజు పరిపాలనా వికేంద్రీకరణ పై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. పరిపాలనా వికేంద్రీకరణపై సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చర్చించనున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో మొదటిగా మూడు రాజధానుల అంశంపై చర్చలు జరగనున్నాయని తెలిసిన సమాచారం. దీనిపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తారని, ఈ రాజధానులు అంశం పై కీలక ప్రకటన తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మూడు రాజధానుల మీద బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిసిన సమాచారం. అసెంబ్లీ సమావేశాలు మొత్తం 25 అంశాల పై చర్చించనున్నారని అధికార పక్షం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసిన సమాచారం. భూముల రీ-సర్వే రైతు యజమానులకు శాశ్వత భూ యాజమాన్య హక్కును కల్పించడానికి టైటిలింగ్ యాక్టు సవరణను ప్రవేశ పెట్టానున్నారు. ఈ బిల్లును మూడోసారి సభలో పెట్టనున్నారు. దీనిపై స్పష్టత వచ్చాక ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు పంపనున్నారు.