Site icon Prime9

CM Jagan: పీడిస్తున్న లోన్ యాప్ లను ఉపేక్షించవద్దంటూ ఆదేశాలు..

jagan serious about loan

jagan serious about loan

Andhra Pradesh: రుణం, రుణం ఈ మాటలు సామాన్యుడి దగ్గర నుండి బడా బడా పారిశ్రామిక వేత్తల వరకు నిత్యం వారి వారి లావాదేవీలకు అవసరమైన మాటలే. అవసరాన్ని క్యాష్ చేసుకొనేందుకు మార్కెట్టులో రుణయాప్ లు వీధికొకటి వెలవడం. ఫైనాన్స్ కోసం ఎదురుచేసే వారికి అభయహస్తం మా సంస్ధ అంటూ నమ్మించడం. ఇది అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం లో ఓ రుణ యాప్ ద్వారా పొందిన లోన్ కట్టకపోవడంతో లోన్ నిర్వాహకుల నుండి ఎదురైన వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య పాల్పొడిన ఓ దంపతుల వ్యవహారంలో ఏపి ప్రభుత్వం మేల్కొనింది. రుణ యాప్ ల ఆగడాల పై సిఎం జగన్ సీరియస్ అయ్యారు. పీడిస్తున్న లోన్ నిర్వాహకులకు ఉపేక్షించవద్దంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

రాజమహేంద్ర వరంకు చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి దంపతులు తాము తీసుకొన్న లోన్ ను చెల్లించలేకపోవడంతో పాటుగా రుణం ఇచ్చిన నిర్వాహకుల వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అన్యం పుణ్యం ఎరుగున వారి చిన్నారులు నాగసాయి(4) లిఖిత శ్రీ(2) ఇరువురు అనాధలుగా మారారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్ ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు రోడ్డున పడ్డ చిన్నారుల ఒక్కొరికి చెరో 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ మాధవిలతకు ఆదేశాలు జారీచేసారు. రుణ యాప్ ల ఆగడాలు రాష్ట్ర వ్యాప్తంగా శృతి మించిపోయాయి. వారి భారిన పడిన బాధితులు ఇతరులకు చెప్పుకోలేక, తీసుకొన్న అప్పుకన్నా, అధిక మొత్తాన్ని చెల్లించలేక, విషయాన్ని ఎవ్వరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పోడుతున్నారు.

Exit mobile version