Site icon Prime9

Chandrababu Naidu: అమరావతే నిలుస్తుంది…. అమరావతే గెలుస్తుంది… చంద్రబాబు నాయుడు

Chandrababu Naidu

Chandrababu Naidu

Amaravathi: ఏడేళ్లకిందట ఏపీ రాజధానిగా అమరావతి కి ప్రధాని మోదీ శంకుస్దాపన చేస్తే పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసారు.

ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని @narendramodi చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించాం. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యింది.అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది సంకల్పంగా అభివర్ణించారు. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారని.. ఎన్నికల ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి… అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశాడు.

అమరావతి రైతుల మహా పాదయాత్ర పై వైసీపీ కుతంత్రాలు సాగవు. ఆంధ్రుల రాజధాని అమరావతే. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుంది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుంది. నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది…. అమరావతే గెలుస్తుంది… ఇదే ఫైనల్ అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు.

Exit mobile version