Site icon Prime9

Supreme Court: అమరావతి పై అన్ని కేసులు ఒకే చోటకు.. నేడు విచారించనున్న సర్వోన్నత న్యాయస్ధానం

All cases on Amaravati at one place.

Amaravati Capital Issue: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయి 8 ఏళ్లకు పైబడినా రాజధాని అంశాలు ఏపీ ప్రజలను నిరాశపరుస్తున్నాయి. అభివృద్ధికి ఎంతో కీలకమైన రాజధానిని నేటి ప్రభుత్వం రాజకీయం చేయడంతో పలు పిటిషన్లు సుప్రీంకోర్టుకు చేరాయి. దీనిపై ధర్మాసనం నేడు విచారణ చేటప్టనుంది.

అమరావతి కేసులన్ని ఒకే ధర్మాసనం ముందు లిస్టు చేయాలని సీజేఐ సూచించారు. ఈ నేపథ్యంలో అన్ని కేసులను జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ కేసుల జాబితాలో రిజిస్ట్రీ చేర్చింది. నేటి రాజధాని అమరావతికి సంబంధించిన కేసులతో పాటుగా, 2013, 14ల్లో రాష్ట్ర విభజనను, రాష్ట్ర విభజన చట్టాన్ని సవాల్‌ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు, విభజన చట్టం హామీలు అమలు పై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి వేసిన పిటిషన్లన్నీ కలిపి జత చేసారు. తొలుత విచారణను ఈ నెల 14వ తేదీన విచారిస్తున్నట్లు తెలిపిన్నప్పటికీ అనంతరం నేడు విచారించనున్నట్లు కోర్టు సిబ్బంది తెలిపారు.

అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై ఈ నెల ఒకటవ తేదీన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఆ సమయంలో గతంలో రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాల్లో న్యాయవాదిగా 2014లో ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ సలహా ఇచ్చిన అంశాన్ని అమరావతి రైతుల తరపు న్యాయవాది ప్రస్తావించారు. దీంతో, వెంటనే ఈ కేసు విచారణ నుంచి తాను తప్పుకుంటున్నానని, మరో ధర్మాసనంకు ఈ కేసు బదిలీ చేయాలని సీజేఐ సూచించారు.

ఇది కూడా చదవండి: Vizag Court: 467 సెక్షన్ వర్తించదు.. అయ్యన్న రిమాండ్ కు తిరస్కరించిన మెజిస్ట్రేట్

 

Exit mobile version