Site icon Prime9

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి.. 5 స్థానాల్లో ఎలక్షన్స్

all arrangements set for mlc elections in andhra pradesh

all arrangements set for mlc elections in andhra pradesh

MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం జరిగే ఎన్నికల కోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికార పార్టీ ఉవ్విలూరుతుండగా, అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా ప్రచారం చేశాయి. కాగా ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖలో గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఎన్నికలు.. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్‌ ఎన్నికలు జరగనున్నాయి.

సోమవారం ఉదయం 8 నుంచి 4 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆ వెంటనే ఫలితాలు విడుదల కానున్నాయి. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు ఎవరికి వారు ముమ్మరంగా ప్రచారం చేశారు. దీంతో పాటు ప్రభుత్వానికి, తమ సత్తా చూపించాలని ఉపాధ్యాయ సంఘాల్లో భారీగా చీలికలు వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో పాటు గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఓటర్లకు భారీగానే తాయిలాలు పంపిణీ చేయడానికి ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఇక సిట్టింగ్ స్థానాలను కాపాడుకునేందుకు అభ్యర్థులు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నట్లు సమాచారం.

ఆ అభ్యర్థులకు గతంలో మద్దతు ఇచ్చిన కొన్ని సంఘాలు అధికారపక్షం, ఇండిపెండెంట్ అభ్యర్థులకు మద్దతు పలుకుతున్నారు. కొందరు ఓటుకు 3 నుంచి 5 వేల రూపాయలు చొప్పున పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అటు సోమవారం పోలింగ్‌ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైన్‌షాపులు బంద్‌ చేయడంతోపాటు పోలీసు బందోబస్తు పెంచారు. ఈ నేపథ్యంలో పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఆరు జిల్లాల్లో 331 పోలింగ్ కేంద్రాలు (MLC Elections)..

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఆరు జిల్లాల్లో 331 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రెండు లక్షల 9 వేల మంది ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకోగా.. ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనకాపల్లి జిల్లాలో 49, అల్లూరి జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 72, మన్యం జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ లోనూ..

ఇక మార్చి 13న తెలంగాణలో 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇందులో 126 మెయిన్ కేంద్రాలు కాగా.. మిగతావి అదనంగా ఏర్పాటు చేశామన్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version