Site icon Prime9

Actor Surya : తన బర్త్ డే రోజు ప్రమాదంలో మృతి చెందిన అభిమానుల కుటుంబ సభ్యులకు అండగా హీరో సూర్య..

Actor Surya video call with his died fans family members

Actor Surya video call with his died fans family members

Actor Surya : తమిళ్ స్టార్ హీరో సూర్య.. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అయితే ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేట మోపువారిపాలెంకి చెందిన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సూర్య బర్త్ డేని సెలబ్రేట్ చేద్దామనుకొని మృత్యువు ఒడిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా డిగ్రీ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సూర్య బర్త్ డే బ్యానర్స్ కడుతున్న సమయంలో కరెంటు షాక్ తగిలి ప్రమాదానికి గురయ్యారు.

ఈ ప్రమాదంలో పోలూరు సాయి, నక్కా వెంకటేష్ అక్కడక్కడే మరణించగా మరో అభిమాని మాత్రం తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. ఈ ఇద్దరి మరణం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ వార్త సూర్య వరకు వెళ్లడంతో బాధిత కుటుంబాలను ఫోన్ చేసి పరామర్శించాడు. తన పుట్టినరోజు వేడుకల్లో ఇలా జరగడం తనకి ఎంతో బాధని కలిగిస్తుందని బాధ పడ్డాడు. అభిమానుల కుటుంబాలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. అలాగే వారి కుటుంబాలకి తోడుగా ఉంటానని సూర్య హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

 

 

Exit mobile version