Andhra Pradesh: రెవిన్యూ శాఖ అంటేనే ప్రజలు బెంబేళెత్తిపోతున్నారు. లంచం కోసం సామాన్యుడిని కూడా వదలడం లేదు. దీంతో ఉన్నది కట్టబెట్టడమో లేదా సరిపెట్టుకోవడమో జరిగేలా ప్రభుత్వ సిబ్బంది ప్రజలను నంజుకు తింటుంటారు. అలాంటి సంఘటనలో ఓ బాధితుడు ఏసిబి ఆశ్రయించడంతో వలలో రెవిన్యూ సిబ్బంది చిక్కుకొన్నాడు.
ఆ ఘటన ఆంధ్రప్రదేశ్ అరకులోయలో చోటుచేసుకొనింది. సమాచారం మేరకు ఈ దినం ఉదయం అల్లూరి జిల్లా అరకులోయలో ఏసిబి అధికారులు రెవిన్యూ కార్యాలయం పై దాడులు చేపట్టారు. బాధితుడు రెవిన్యూ ఇన్స్ పెక్టర్ అర్జున్ కు రూ. 35వేలు ఇస్తుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. భూమి కోల్పోయిన లబ్దిదారుల పేరును రికార్డులో నమోదు చేసేందుకు ఆర్ఐ లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసిబిని ఆశ్రయించాడు. విచారణ అనంతరం ఆర్ఐను రిమాండ్ కు తరలించిన్నట్లు అధికారులు తెలిపారు.