Site icon Prime9

Ambedkar Konaseema: చనిపోయేందుకు పర్మిషన్ ఇవ్వండి సార్.. అంబేద్కర్ జిల్లా కలెక్టర్ కు లేఖ.. ఏం కష్టమొచ్చిందో ఆ తల్లికి పాపం

A woman-request to-Ambedhakar konaseema district collector-for-mercy-death

A woman-request to-Ambedhakar konaseema district collector-for-mercy-death

Ambedkar Konaseema: జీవితం భారంగా మారింది నా ఇద్దరు పిల్లలతో కలిసి ఇక ఈ జీవితం కొనసాగించలేను. మేము చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి కలెక్టరు సార్ అంటూ ఒక మహిళ అర్జీ పెట్టుకుంది. ప్రస్తుతం ఈ అర్జీ సంచలనంగా మారింది. పాపం ఆ తల్లికి అంతటి కష్టం ఏమివచ్చిందంటూ కలెక్టర్ ఆరా తీస్తే హృదయవిదారకమైన వారి జీవిత కథనం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ మహిళ కుటుంబంతో సహా చనిపోవడానికి ఎందుకు కలెక్టర్ ను వేడుకుంది ఆమె కష్టం ఏంటో చూసేద్దాం.

కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం..

వివరాల్లోకి వెళ్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా‌ ముమ్మిడివరం మండలం కొమానపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్, సత్యశ్రీ దంపతులు తమ ఇద్దరు కుమారులతో ఎంతో సంతోషంగా జీవించేవారు. శ్రీనివాస్ నాగపూర్ లో ఒక ప్యాక్టరీలో సూపర్ వైజరుగా పనిచేస్తూ ప్రభుత్వానికి ఆదాయపన్నుకూడా కట్టేవాడు. తన ఇద్దరు పిల్లలనూ మంచి కాన్వెంట్ లో చదివించేవాడు. అంతలోనే ఈ కుటుంబంపై విధి పగబట్టిందో ఏమో కానీ శ్రీనివాస్ ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వేరే ప్రాంతానికి మారితే ఆరోగ్యం కుదుటపడుతుందని భావించి ఆ కుటుంబమంతా షిర్డీకి షిఫ్ట్ అయ్యింది. అయినా కానీ అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో తమ సొంత గ్రామమైన కొమానపల్లికి వచ్చేసారు. శ్రీనివాస్ ఆరోగ్యం బాగుచెయ్యడానికి ఉన్న డబ్బంతా ఖర్చు చేశారు. లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ అనేక ఆసుపత్రులు తిరిగారు అయినా ఫలితం లేకపోయింది. మూడు సంవత్సరాల క్రితం శ్రీనివాస్ మరణించాడు. దానితో ఆ కుటుంబం అంతా రోడ్డున పడింది. ఇంటిపెద్దను కోల్పోయి ఇద్దరు పిల్లలతో రోడ్డున పడిన శ్రీసత్య కూలీపనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ వారి ఆలనాపాలనా చూసుకునేది.

నా పిల్లలకు అమ్మఒడి కూడా రాదు..

అయితే వీరికి అందరిలా అమ్మఒడి డబ్బు కూడా వచ్చేది కాదు. తన రెక్కల కష్టంతోనే వారిని శ్రీసత్య చదివించేది. కాగా గతేడాదే ఆమెకు వితంతు ఫించన్ను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ప్రతీనెలా వచ్చే పింఛను అకస్మాత్తుగా ఆగిపోయింది. దానితో ఏంటా ఫించన్ రాలేదని శ్రీసత్య ఆరా తీయగా తన భర్త బ్రతికి ఉన్నప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాడని.. దానితో ఇప్పుడు ఆమెకు పింఛను నిలిపి వేస్తున్నట్లు సమాచారం అందించింది. ఈ సమాధానం విని ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. గతంలో తమ పరిస్థితి బాగానే ఉందని కానీ తన భర్త చనిపోయినదగ్గరి నుంచి పరిస్థితులు తారుమారయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలతో సహా రోడ్డున పడ్డామని ప్రస్తుతం తన ఆరోగ్యం కూడా బాగా లేకపోవడంతో కూలిపనులకు కూడా వెళ్లలేకపోతున్నాననంటూ కన్నీరుపెట్టుకుంది.

పథకాలైనా ఇవ్వండి లేదా ప్రాణాలు తీసుకోవడానికైనా అనుమతివ్వండి

ఇప్పుడు ప్రభుత్వం కూడా తమపై పగబడుతూ తన పింఛను నిలిపివేయటంతో జీవించడం కష్టంగా మారిందని.. తాను చనిపోతే తన బిడ్డలు అనాథలవుతారని భావించిన ఆమె, తనతో పాటు తన కుమారులకు కూడా కారుణ్య మరణం‌ పొందేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్కు లేదా ప్రభుత్వం తన పింఛన్ను పునరుద్ధరించాలంటూ రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. తాము జీవించి ఉండాలంటే తన పిల్లలు చదువుకునేందుకు అమ్మ ఒడి పథకం ఇవ్వాలని వేడుకుంటోంది.

ఇదీ చదవండి: గడ్డి కోసం డాబా ఎక్కిన దున్నపోతు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

Exit mobile version