Amaravati: అమరావతిలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య చిచ్చు రేగింది. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ అమరావతిలో టెన్షన్ నెలకొంది.
అమరావతిలో ఉత్కంఠ..
అమరావతిలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య చిచ్చు రేగింది. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ అమరావతిలో టెన్షన్ నెలకొంది.
రెండు వర్గాల మధ్య అవినీతి చర్చకు దారి తీసింది. దీంతో ఆదివారం అమరేశ్వరాలయంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసిరారు.
రెండు వర్గాల ఘర్షణతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో అమరావతిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ మేరకు డీఎస్పీ నారాయణ మీడియాతో మాట్లాడారు. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం రాత్రి 9 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
సవాళ్లు సహజమని.. కానీ అవి ప్రజలకు విఘాతం కలిగిస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. ఇరు పార్టీల నాయకులు ఆలయానికి రావొద్దని సూచించారు.
అమరావతి చుట్టూ భద్రతా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అమరావతి పరిసరాల్లో కొత్త వ్యక్తులను లాడ్జీల్లో కొత్త వ్యక్తులకు గదులు ఇవ్వద్దని సూచించారు.
అమరావతిలో ఎవరూ రెచ్చగొట్టె వ్యాఖ్యలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
తెదేపా నేతల ఇంటివద్ద పోలీసుల పహారా
పెదకూరపాడు, న్యూస్‌టుడే: అమరావతికి వెళ్లకుండా తెదేపా నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్నారు.
ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసు పహారా కాస్తున్నారు. నోటీసులు ఇచ్చి, ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, ఐదు మండలాల తెదేపా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలకు పోలీసులు శనివారం నోటీసులు అందజేశారు.
పోలీసులు ఆంక్షలు పెట్టడంపై తెదేపా నేతలు మండిపడుతున్నారు.
స్వేచ్ఛగా వైకాపా నేతలు తిరుగుతున్నారని, తెదేపా నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.