Prime9

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ దిక్కులేకుండా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

 Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దిక్కులేకుండా మారిందని దీనిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ ముఖ్యనేతలతో సమావేశమయి వారికి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను కులం, మతాన్ని దాటి వచ్చానని మానవత్వాన్ని నమ్మానని అన్నారు.

ఒక్కసారి జనసేనను నమ్మండి..( Pawan Kalyan)

నాకు మతాలపై గౌరవం ఉంది. ముస్లింలను మైనార్టీ ఓటు బ్యాంకుగా చూడను. ఒక్కసారి జనసేనను నమ్మాలని ప్రజలను కోరుతున్నాను. మాట ఇస్తే వెనక్కి తగ్గను.. అన్నీ ఆలోచించాకే మాట ఇస్తాను. రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాను. ఉద్దానంలో సమస్యలు ఏళ్ల తరబడి అలాగే ఉన్నాయని పవన్ అన్నారు. ప్రకాశం జిల్లా నుంచి వలసలు ఆగాలన్నారు. నీటి సమస్య, వలసలు తగ్గాలి..ఉపాధి అవకాశాలు పెరగాలని అన్నారు.నాయకులకు అభివృద్ధి ఉంది కానీ ప్రజలకు లేదు.మీ అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తాం.వచ్చే ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి .మీకు అన్యాయం జరిగితే నేను ముస్లింలవైపే ఉంటాను.మీ పక్షాన గళం ఎత్తే నాయకుడిని నేనే.ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా పనిచేయాలని పవన్ నేతలకు సూచించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీలో చేరిన మైనార్టీ నాయకులను పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జగన్ నీ ఛీప్ ట్రిక్స్ నా దగ్గర వద్దు నా గురించి తెలుసుకో | PawanKalyan Mass Warning To CM Jagan

 

Exit mobile version
Skip to toolbar