Prime9

Adani Group: తెలంగాణలో రూ.12,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అదానీ గ్రూప్

Adani Group: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఈ మేరకు రాష్ట్రంలో 12వేల, 400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలోని పలు రంగాల్లో 12వేల, 400 కోట్లు పెట్టుబడులకు సంబంధించిన నాలుగు అవగాహన ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకుంది.

అదానీ గ్రూపు పెట్టుబడులు..(Adani Group)

తెలంగాణలో 1350 మెగావాట్ల సామర్థ్యంతో రెండు స్టోరేజీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.5,000 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. చందనవెల్లిలో మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీకాన్‌ఎక్స్ డేటా సెంటర్లు రూ.5,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ 6.0 MTPA సామర్థ్యంతో తెలంగాణలో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌లో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్‌లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ మరియు మిస్సైల్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని రేవంత్‌రెడ్డి అదానీకి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి | Another Huge investment in Telangana | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar