Chandrababu Naidu: చంద్రబాబు నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీనితో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 22 వరకూ చంద్రబాబు రిమాండ్ లో ఉంటారు.

  • Written By:
  • Updated On - September 10, 2023 / 07:28 PM IST

Chandrababu Naidu:  స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీనితో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఈ నెల 22 వరకూ చంద్రబాబు రిమాండ్ లో ఉంటారు. తీర్పు తరువాత చంద్రబాబు నాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబును భారీ బందోబస్తుతో రాజమండ్రి తరలించడానికి వీలుగా రూట్ ను క్లియర్ చేస్తున్నారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.

చంద్రబాబు పై 34 అభియోగాలు నమోదు..(Chandrababu Naidu)

చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి. ఈ కేసులో కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టుపై ఇరుపక్షాలు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.చంద్రబాబుపై సీఐడీ 34 అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఏఏజీ తెలిపారు. స్పీకర్‌కు సమాచారం ఇస్తే సరిపోతుందన్నారు. అన్ని నియమాలను పాటించామని.. మాజీ సీఎం అనేది గౌరవప్రదమైన హోదా మాత్రమే అని చెప్పారు. చంద్రబాబు ప్రస్తుత హోదా ఎమ్మెల్యే మాత్రమే అని.. అరెస్ట్‌కు ముందు స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని ఏఐజీ కోర్టుకు చెప్పారు. అరెస్టయిన మూడు నెలల్లోపు గవర్నర్‌కు ఎప్పుడైనా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.

చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో సీఐడీ అరెస్ట్ చేసింది. చరూ.371 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబుపై కేసు నమోదు చేసారు. 3 నెలల్లో 5 విడతల్లో రూ.371 కోట్లు చెల్లించారిన అభియోగాలు న్నాయి.జూన్ 2014లో రూ.3,356 కోట్లతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ఏర్పాటు చేసారు. జర్మనీ కంపెనీ సీమెన్స్‌తో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సీమెన్స్ గ్రాంట సమకూర్చకుండానే 10 శాతం కింద రూ.371 కోట్లు చెల్లించినట్లు సీఐడీ ఆరోపించింది.