Site icon Prime9

Vitamin Deficiency: ఏ విటమిన్ లోపం వల్ల పైయోరియా వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం

teeth prime9news

teeth prime9news

Vitamin Deficiency: ఏ విటమిన్ లోపం వల్ల పైరియా వస్తుందో ఇక్కడ తెలుసుకుందాం

విటమిన్ బి:

దంతం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ బి12 చాలా అవసరం.దీని లోపం దంతాల రోగనిరోధక శక్తిపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు అది బలహీనపడటం ప్రారంభమవుతుంది.ఇది పైయోరియా రూపంలో ఉండవచ్చు.దీని నుంచి బయటపడాలంటే రోజువారీ ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులు ,కొవ్వు చేపలను చేర్చుకోవడం వల్ల ఈ సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు.

విటమిన్ సి:

విటమిన్ బి12 మాత్రమే కాదు, విటమిన్ సి లోపం వల్ల ఉన్నా కూడా పైయోరియా వస్తుంది.నిజానికి, విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.అలాగే దీనితో పాటు, దాని లక్షణాలు ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి మనలను కాపాడుతాయి.ఈ పోషకాలను పొందడానికి, మీరు నారింజ, నిమ్మ మరియు ద్రాక్షతో సహా పుల్లని పదార్థాలను తీసుకోండి.

విటమిన్ డి:

మన ఎముకల దృఢత్వానికి, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి అవసరం.మన దంతాలు కూడా ఈ ఎముకలలో భాగమే. కాబట్టి దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి చాలా ముఖ్యం.ఈ పోషకాలను పొందాలంటే ఒక మార్గం ఎండలో రోజుకు 20 నుండి 25 నిమిషాలు ఎండలో ఉండండి.ఐతే ఈ విటమిన్ కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా పొందవచ్చు.

Exit mobile version