Site icon Prime9

Onion Juice: ఉల్లిరసంతో జుట్టు సమస్యలకు చక్కటి పరిష్కారం

onion-juice-is-the-best-remedy-for-all-your-hair-problems

onion-juice-is-the-best-remedy-for-all-your-hair-problems

Onion Juice: ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యలేదు అనే నానుడి ప్రచారంలో ఉంది. ఉల్లి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మేలుచేస్తుంది. మరీ ముఖ్యంగా జుట్టు సంరక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఇటీవల కాలంలో ఆనియన్ హెయిర్ ఆయిల్, ఆనియన్ షాంపూలను బాగా ప్రచారంలోకి వచ్చాయి.
ఉల్లిలో జింక్, సల్ఫర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియంలతో పాటు బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేందుకు బ్యాక్టీరియాలు శిలీంద్రాలను అరికట్టడంలో సహాయపడతాయి. ఉల్లిపాయలలోని సల్ఫర్ సమ్మేళనం శరీరంలో కేటలేస్ ఎంజైమ్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు కారణమయ్యే ఎంజైమ్, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు తెల్లబడకుండా కూడా కాపాడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుందని పలు పరిశోధనలు స్పష్టం చేసింది. మరి ఈ ఉల్లిరసం జుట్టుకు ఏవిధమైన ప్రయోజనాలు చేకూరుస్తుంది, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

చుండ్రు పోవాలంటే
ఆరు చెంచాల ఉల్లిపాయ రసానికి రెండు చెంచాల పెరుగు కలిపి జుట్టుకు, స్కాల్ప్ కు పట్టించి 40 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తే చుండ్రు, ఇతర సమస్యలు దూరమవుతాయి. ఇది మంచి కండీషనర్‌గా పనిచేసి జుట్టును స్మూత్‌గా మార్చుతుంది.

ఒత్తుగా ఉండే జుట్టు కోసం
నాలుగు నుంచి ఐదు చెంచాల ఉల్లిపాయ రసంలో రెండు చెంచాల పటిక కలపండి, ఈ మిశ్రమాన్ని తలకు మసాజ్ చేయండి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇందులోని రిసినోలిక్ యాసిడ్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

సిల్కీ జుట్టు కోసం
రెండు చెంచాల ఉల్లిపాయ రసానికి ఒక చెంచా తేనె మిక్స్ చేసి జుట్టుకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సిల్కీగా కూడా మారుతుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించడం
అరకప్పు కొబ్బరి నూనెలో ఒక ఉల్లిపాయను పేస్ట్ చేసి వేసి, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. అరగంట తర్వాత జుట్టు కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.

జుట్టు తెల్లబడకుండా
ఉల్లిపాయ నుండి రసాన్ని తీసి, ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ ఉల్లిపాయ రసంలో కొన్ని ఎండిన కరివేపాకులను కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత స్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు నెరసిపోవడం, తెల్లబడటం తగ్గుతుంది.

ఇదీ చవదండి: చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పులకు చక్కటి చిట్కాలు

Exit mobile version