Prime9

Black Water: “బ్లాక్ వాటర్” తాగడం వల్ల యవ్వనం మీ సొంతం

Black Water: సాధారణంగా మనం తాగే నీరు స్వచ్ఛంగా ట్రాన్సపరెంట్ గా ఉంటుంటాయి. కొన్ని చోట్ల నీరు కాస్త ఎరుపు రంగులో ఉంటే దానిని వడకట్టడం ద్వారా స్వచ్చమైన తాగునీరు చూస్తాము. కానీ ఇప్పుడు ప్రముఖ నటీనటులు, స్పోర్ట్స్ పర్సన్స్ అంతా నలుపు రంగుంలో ఉంటే వాటర్ బాటిల్స్ పట్టుకుని తాగుతుండడం చూస్తున్నాము. ఇదేమైనా మందు అనుకుంటే పొరపాటే ఇదికూడా తాగునీరే అంటున్నారు. మరి ఈ మంచినీరుని బ్లాక్ ఆల్కలీన్ వాటర్ అంటారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రింకింగ్‌ వాటర్‌, ఆర్‌ఓ వాటర్‌, డబుల్‌ ఆర్‌ఓ వాటర్‌, ఆల్కలీన్ వాటర్‌ (బ్లాక్‌ వాటర్‌).. ఇలా ఎన్నో రకాల తాగు నీరు దొరుకుతున్నాయి. అయితే ఈ నీటిలో ఏది మంచిది అనే సందేహం మీకు కలిగి ఉండవచ్చు. సాధారణంగా నీటిలో పీహెచ్‌ స్థాయి 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది. అయితే, ఆల్కలీన్‌ నీటిలో పీహెచ్‌ స్థాయి 8,9 గా ఉంటుంది. ఇలా పీహెచ్‌ స్థాయిలు ఎక్కువగా ఉన్న ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు తెలిపారు.

ఆల్కలీన్‌ వాటర్‌ ప్రయోజనాలు

దీని ధర ఎక్కువ.. నష్టాలు తక్కువ

ఈ నీటిని మరీ ఎక్కువగా తాగితే, వికారం, వాంతులు, శరీర ద్రవాల పీహెచ్ స్థాయిల్లో మార్పులు వంటివి వచ్చే అవకాశముందని ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. మన దేశంలో చాలా తక్కువ సంఖ్యలో అల్కలీన్‌ వాటర్‌ దొరుకుతున్నది. కాగా దీని ధర ఒక లీటరుకు వందరూపాయలకుపైనే డబ్బు వసూలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:  గోల్డెన్ బ్లడ్.. బంగారం కన్నా విలువైన రక్తం

Exit mobile version
Skip to toolbar