Site icon Prime9

Health Tips: వీటిని తినండి మీ గుండెను ఆరోగ్యంగా ఉంచండి.

avakado prime9news

avakado prime9news

Health: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన గుండె తీరు మంచిగా ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు మనం శరీరానికి హాని చేయనవి తీసుకోవాలి లేదంటే మన శరీరం పై చెడు ప్రభావాలను చూపుతాయని నిపుణులు వెల్లడించారు. అలాగే బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి, వీటి వల్ల గుండె సంబంధిత సమస్యలు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు. ఐతే మనం ముందు చేయాల్సిన పని ఏంటంటే మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కొన్ని తిండి పదార్థాలను మనం రోజు తీసుకునే ఆహారంలో తీసుకుంటే చాలు అలా చేయడం వల్ల గుండె సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

బెర్రీస్‌
బెర్రీస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్లు చాలా అధిక మొత్తంలో దొరుకుతాయి. అలాగే వీటిని మనం రోజు తీసుకుంటుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఇంఫ్లమేషన్ లాంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది.

అవకాడో
గుండెను ఆరోగ్యంలో ఉంచడంలో అవకాడో బాగా పని చేస్తుంది. ఎందుకంటే అవకాడోలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా దొరుకుతాయి. దీని వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను కూడా తగ్గుతాయి. అలాగే గుండెను ఆరోగ్యంలో పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా పొటాషియం ఒక అవకాడోలో 975 మిల్లీ గ్రాముల పొటాషియం మనకి దొరుకుతుంది.

బీన్స్

బీన్స్‌తో మన గుండెను బలంగా చేసుకోవచ్చు అలాగే బీన్స్‌ని రోజు డైట్‌లో తీసుకుంటే గుండె పని తీరు మెరుగ్గా ఉంటుంది. బీన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. కాబట్టి దీన్ని మీరు రోజు తినే ఆహారంలో తీసుకున్నా మంచిదే అని నిపుణులు ఓ పరిశోదనలో వెల్లడించారు.

Exit mobile version