Zero Shadow Day : జీరో షాడో డే.. అంటే ఆ సమయంలో ఏ వస్తువు, మనిషి నీడ కనిపించదు అని అర్దం. సాంకేతిక పరిభాషలో దీనిని “జెనిత్ పొజిషన్” అంటారు. వివరించి చెప్పాలంటే.. సూర్యుని అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుందని.. ముఖ్యంగా కర్కాటక రాశి, మకరరాశి మధ్య ప్రాంతాలలో కనిపిస్తుంది అని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మన భాషలో చెప్పుకోవాలంటే జీరో షాడో సమయంలో సూర్యుని కాంతి మనిషి పరిధి దాటి పోలేని కారణంగా నీడ కనిపించదు.. అదే జీరో షాడో డే.
ఎప్పుడు ? ఏ సమయానికి అంటే ?? Zero Shadow Day ..
కాగా ఈ అద్భుతం ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా కనువిందు చేయనుంది. ఈ నెల 9న సరిగ్గా మధ్యాహ్నం 12:12 గంటలకు ఈ విధంగా జరగనున్నట్లు బిఎం బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్.హరిబాబుశర్మ తెలిపారు. ఆ సమయంలో సూర్యకిరణాలు నేరుగా హైదరాబాద్‌లో పడతాయని అంటున్నారు. అప్పుడు సూర్యునిలో నిటారుగా (90 డిగ్రీల కోణం) ఉంచిన ఏ వస్తువు యొక్క నీడ రెండు నిమిషాలు అంటే 12:12 నుండి 12:14 వరకు కనిపించదని పేర్కొంది. ఎండలో నిలబడినా మన నీడ కనిపించదని అన్నారు.
అదే విధంగా ఆగస్టు 3న హైదరాబాద్‌లో “జీరో షాడో డే”ను కూడా నిర్వహిస్తామని వివరించారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో దాదాపు అన్ని ప్రాంతాల్లో నీడ కనుమరుగవుతుందన్నారు. కాగా, ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 12.17 గంటలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడలు రెండు నిమిషాల పాటు మాయమయ్యాయి.