Site icon Prime9

Viswak Sen : పెళ్లి పీటలు ఎక్కబోతున్న మాస్ కా దాస్ “విశ్వక్ సేన్”.. అమ్మాయి ఎవరంటే ?

young hero Viswak Sen post about his marriage

young hero Viswak Sen post about his marriage

Viswak Sen :  “ఈ నగరానికి ఏమైంది” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో “విశ్వక్ సేన్”. ఆ తర్వాత ఫలక్ నామా దాస్ మూవీతో ప్రేక్షకుల్లో మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత హిట్, పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం.. లేటెస్ట్ గా వచ్చిన  “దాస్ కా దమ్కీ” సినిమాలతో సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ యంగ్ హీరోలలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న వారిలో విశ్వక్ సేన్ కూడా ఒకరు అని చెప్పాలి. అయితే తాజాగా విశ్వక్ పెళ్లిపీటలు ఎక్కుతున్నారని తెలుస్తుంది.

ఇటీవల యంగ్ హీరోలైన శర్వానంద్ పెళ్లి చేసుకోగా.. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ కూడా పెళ్ళికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వరుసగా గామి, VS10, VS11 మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో.. సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో.. “ఇన్నాళ్ల నుంచి నా పై ప్రేమ చూపించే అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎప్పటికి రుణపడి ఉంటాను. ఇక ఇప్పుడు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా జీవితంలోని మరో ఘటాన్ని నేను ప్రారభించబోతున్నాను. నేను కుటుంబాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఆగష్టు 15న పూర్తి వివరాలు తెలియజేస్తాను” అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో అన్నా వదిన ఎవరో చెప్పు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

Exit mobile version