Minister Usha: రాష్ట్రంలో ఇప్పుడు ఓ రిసార్ట్ నిర్మాణం చర్చనీయంశంగా మారింది. ఈ రిసార్ట్ ను 300 ఎకరాల్లో నిర్మించాలని మంత్రి ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విలాసవంతమైన భారీ రిసార్ట్ నిర్మాణం వెనక ఉన్న మంత్రి ఎవరనేది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి ఉష శ్రీచరణ్ (Minister Usha) ఈ రిసార్ట్ ను నిర్మిస్తున్నట్లు రాష్ట్రంలో జోరుగా ప్రచారం సాగుతోంది.
కనగానపల్ల మండలం.. తూంచెర్ల గ్రామ పరిధిలో ఈ రిసార్ట్ ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాణానికి 300 ఎకరాలు అవసరం అవ్వగా.. ప్రస్తుతం 120 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలుస్తోంది.
సమీప రైతుల నుంచి బలవంతంగా భూములు కొంటున్నారని.. భూములు ఇవ్వని రైతులపై వైసీపీ నేతలు ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం.
తూంచెర్ల గ్రామ పరిధిలో గతంలో సుజలాన్ సంస్థ పవన విద్యుత్ కోసం రైతుల నుంచి భూములను సేకరించింది.
అప్పట్లో సగం పనులు పూర్తవ్వగా.. మిగతా భూమిని సుజలాన్ సంస్థ అలాగగే వదిలేసింది. మరోవైపు కళ్యాణదుర్గం, కంబదూరు మండలాల్లో ఈ సంస్థ భూములను సేకరించింది.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెద్దగా పట్టించుకోని ఉష శ్రీ చరణ్.. మంత్రి పదవి వచ్చాక ఈ భూములను సుజలాన్ కంపెనీ నుంచి భూములను తక్కువ ధరకు కొనేశారు.
తూంచెర్ల గ్రామంలోని సర్వే నెంబర్లలో భారీగా భూముల కొనుగోలు.
సర్వే నంబర్ 124-2, 3లో 10.92 ఎకరాలు.. 125లో 33.98 ఎకరాలు కొనుగోలు.
సర్వే నంబర్ 127లో 10 ఎకరాలు.. ఇలా మెుత్తం 54.9 ఎకరాలను కొన్నారు. ఓ రైతు పొలం మీదుగా రోడ్డు వేయడంతో ఆ రైతు ఆందోళనకు దిగాడు.
మరో రైతును బలవంతం చేయడంతో ఆ రైతు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
సుజలాన్ సంస్థ సేకరించగా మిగిలిపోయిన భూములు.
ఆ భూములను కబ్జా చేసిన మంత్రి అనుచరులు.
దాదాపు 20 ఎకరాల భూమిని ఆక్రమించిన మంత్రి అనుచరులు.
ప్రశ్నించిన రైతులపై భౌతిక దాడులకు పాల్పడుతున్న నేతలు.
హంద్రీనీవాలో భాగంగా తెదేపా పాలనలో 53 కిలోమీటర్ల కాలువ తవ్వారు.
కాలువకు సమీపంలోనే రిసార్టు నిర్మాణం కొనసాగిస్తున్నారు.
రిసార్ట్ లో చెరువు నిర్మాణం చేసేలా ప్రణాళిక.
రిసార్టులో బోటింగ్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
చెరువు నిర్మాణం కొరకు జల వనరులశాఖ ప్రతిపాదనలు. నిర్మిస్తున్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/