Site icon Prime9

Where Is Pushpa: ఇదిగో పుష్ప.. పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం

where is pushpa

where is pushpa

Where Is Pushpa: పుష్ప 1 ఎంతపెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పుష్ప 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి అమాంతం పెరిగింది. దానికి తగినట్లుగానే.. పుష్ప ఎక్కడ ఉన్నాడు అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది మూవీ టీం. తాజాగా దానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది.

ఇదిగో పుష్పా.. (Where Is Pushpa)

పుష్ప 1 ఎంతపెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పుష్ప 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి అమాంతం పెరిగంది.

దానికి తగినట్లుగానే.. పుష్ప ఎక్కడ ఉన్నాడు అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది మూవీ టీం.

తాజాగా దానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది. ఇందులో అల్లుఅర్జున్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.

ఇటీవలే.. ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో పుష్ప ఎక్కడ అంటూ ఆడియోన్స్ లో ఆసక్తిని రేకేత్తించారు.
Where is Pushpa? | Pushpa 2 - The Rule 🔥 | Telugu | Allu Arjun | Sukumar | Rashmika | Fahadh Faasil

రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా.. ఈ వీడియోను విడుదల చేశారు. 3 నిమిషాల నిడివి ఉన్న టీజర్ ను విడుదల చేశారు.

పుష్ప తిరుపతి జైలు నుంచి పారిపోయాడనే వాయిస్ ఓవర్ తో ప్రారంభం అవుతుంది.

దీంతో పుష్ప కోసం శేషాచలం అడవుల్లో సెర్చింగ్ ఆపరేషన్ చెపడతారు. ఇందులో పోలీసులకు పుష్ప చొక్కా దొరుకుతుంది. పుష్ప చనిపోయి ఉంటాడని ఓ వార్త వస్తుంది.

కానీ పుష్ప చనిపోలేదని తెలుస్తోంది. పుష్ప చేసిన మంచి పనుల వల్ల.. చింతూరు, తిరుపతి ఏరియాలో ప్రజలు ఆందోళన చేస్తారు.

మరో వైపు అడివిలో పులుల కోసం ఏర్పాటు చేసిన కెమెరాలో పుష్ప కనిపిస్తాడు. దీంతో పుష్ప బ్రతికే ఉన్నాడు అని అందరు ఊపిరి పిలుచుకుంటారు.

అదిరిపోయిన టీజర్..

పుష్ప టీజర్ అదిరిపోయింది. ఇందులో కెమెరా ముందుకు పులి వస్తుంది. కానీ అది రెండు అడుగులు వెనక్కి వేసి ఓ వ్యక్తి దారి ఇస్తుంది. ఆ సమయంలో పుష్ప ఎంట్రీ ఇస్తాడు.

ఈ సమయంలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ అదిరిపోయింది. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చింది అని అర్థం.

అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం అనే డైలాగ్ థియేటర్ లో విజుల్స్ వేయించడం ఖాయం.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

Exit mobile version
Skip to toolbar