Amaravathi Padayatra: ఒక రాజధాని-అది అమరావతిగా పేర్కొంటూ అమరావతి రాజధానుల రైతుల తలపెట్టిన మహా పాద యాత్రకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అమరావతి టు అరసవళ్లి పేరుతో తలపెట్టిన పాదయాత్ర నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పాదయాత్ర రైతులకు సాదర స్వాగతాలతో స్థానికులు, నీరాజనాలు పలికారు.
తాడేపల్లి గూడెం నియోజకవర్గం వెంకట్రామన్న గూడెం వద్ద రైతులకు సంఘీభావం తెలుపుతూ తెలుగుదేశం, జనసేన, భాజపా, వామ పక్షాలు వారితో జత కలిసాయి. వారితో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు. దారి పొడువునా రైతులపై పూల వర్షం కురిపించారు. నేడు 16కి.మీ మేర సాగిన పాదయాత్ర వెంకట్రామన్నగూడెం, పెదతడేపల్లి గూడెం, తాడేపల్లి గూడెం మీదుగా పెంటపాడు గ్రామాల మీదుగా చేపట్టారు.
పోలీసులు కూడా పాదయాత్రలో పాల్గొన్న వారికి రక్షణ కల్పించారు. మరోవైపు మఫ్టీలో రైతుల పాదయాత్రపై ఓ కన్నేసారు. సమీపంలోని గ్రామాలు, తాడేపల్లి పట్ణణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. సీఆర్పీ బృందాలు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పహారా చేపట్టాయి. చివరకు ప్రశాంతంగా పాదయాత్ర సాగడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.
ఇది కూడా చదవండి:Venkaiah Naidu: మెరుగైన రోడ్లతోనే అభివృద్ధి సాధ్యం…మాజీ రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు