Viveka Murder Case: సీబీఐ విచారణకు ముందు వైఎస్ విజయమ్మను కలిసిన అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం హాజరు కానున్నారు.

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి శనివారం హాజరు కానున్నారు.

ఈ నేపధ్యంలో విచారణకు ముందు ఎంపీ అవినాష్ రెడ్డి లోటస్ పాండ్ లో వైఎస్ విజయమ్మ తో భేటి అయ్యారు.

అయితే ప్రస్తుతం విజయమ్మ తో అవినాష్ రెడ్డి (MP Avinash Reddy)తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయమ్మను కలిసేందుకు శనివారం ఉదయం లోటస్ పాండ్ కు వచ్చిన ఆయన అనంతరం మీడియా మాట్లాడారు.

సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసుల ప్రకారం శనివారం మధ్యాహ్నం కోటిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు వెళ్లనున్నట్టు తెలిపారు.

సాక్షిగా పిలుస్తోందా? నిందితుడి గానా? (Viveka Murder Case)

అయితే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ రెండుసార్లు నోటీసుులు జారీ చేసింది. ఈ నెల 28న హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలోకి విచారణ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.

అవినాష్ రెడ్డి కి అంతకుముందే మొదటి సారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24 న విచారణకు రావాలని ఆదేశించింది.

అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల హాజరుకాలేనని అవినాష్ రెడ్డి తెలిపారు. విచారణకు రావడానికి 5 రోజుల సమయం కావాలని అవినాష్ రెడ్డి సీబీఐ ని కోరారు.

ఈ నేపథ్యంలో రెండో సారి సీబీఐ నోటీసులు ఇచ్చి.. ఈ నెల 28 న విచారణ కు రావాలని తెలిపింది. రెండేళ్లుగా వివేకా కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. అవినాష్ రెడ్డి ని ఒక్కసారిగా ప్రశ్నించలేదు.

కడప నుంచి హైదరాబాద్ కు కేసు బదిలీ అయిన తర్వాత అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది.

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ని సీబీఐ సాక్షిగా పిలుస్తోందా?లేక నిందితుడి గానా? అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

హత్య కేసును హైదరాబాద్ కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది.

సీబీఐ కి అవినాష్ రెడ్డి లేఖ(Viveka Murder Case)

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు లో పలు అంశాలను ప్రస్తావిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ కు లేఖ రాశారు.

ఈ కేసు ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) అన్నారు.

వివేకానందరెడ్డి హత్య కేసు పారదర్శకంగా జరగాలని తెలిపారు. విచారణను రికార్డు చేసేందుకు అనుమతించాలన్నారు.

తనతో న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/