Site icon Prime9

Latest News: మరోసారి అస్వస్థతకు గురైన విశ్వరూప్.. ముంబైకి తరలింపు

Vishwaroop

Vishwaroop

Vishwaroop : ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఈరోజు మ‌రోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు ఈరోజు మరోసారి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైకి తరలించారు. గతంలో రెండుసార్లు ఆయన ఇదే విధంగా బాధపడుతూ హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో చికిత్సపొందారు.

సెప్టెంబర్‌ 2న దివంగత సీఎం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అమలాపురంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి విశ్వరూప్ హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారిగా ఛాతి నొప్పితో అస్వస్థతకు గురై కిందపడిపోయారు. . రాజమహేంద్రవరంలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం… మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు విశ్వరూప్ అస్వస్థతకు గురవడంతో ఆయనను ముంబై తరలించారు.

Exit mobile version