Site icon Prime9

Allu Arjun: అల్లు అర్జున్‌కి విజయ్‌ దేవరకొండ స్పెషల్‌ గిఫ్ట్‌

Vijay Devarakonda-Allu Ajun

Vijay Devarakonda Gift to Allu Arjun: ‘పుష్ప 2’ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. మూవీ టీం అంతా పోస్ట్‌ ప్రోడక్షన్‌, ప్రమోషనల్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇక థియేటర్‌లో వచ్చేందుకు రెడీ అవుతుంది. సినిమా రిలీజ్‌ సందర్భంగా బన్నీకి విషెస్‌ తెలుపుతూ ‘రౌడీ’ హీరో విజయ్‌ దేవరకొండ బహుమతులు పంపాడు. తన సొంత బ్రాండ్‌ ‘రౌడీ’ నుంచి ప్రత్యేకంగా పుష్ప పేరుతో డిజైయిన్‌ చేయించిన టీ షర్టులను కానుకగా పంపాడు. వాటిని అల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘నా స్వీట్‌ బ్రదర్‌ ది విజయ్‌ దేవరకొండ. నీ ప్రమేకు థ్యాంక్యూ’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు.

దీనికి విజయ్ స్పందిస్తూ.. అవ్‌ యూ అన్నా.. మన సంప్రదాయాలు కొనసాగుతాయి’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా గతంలోనూ విజయ్‌ అల్లు అర్జుని పలుమార్లు గిప్ట్స్‌ పంపిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ వన్‌ టైంలో ఇలాగే స్పెషల్‌ గిఫ్ట్స్‌ ఇచ్చాడు. ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలంతా ఒకరితో ఒకరు సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. సందర్భంగా వచ్చినప్పుడు ఒకరిపై ఒకరు అభిమానం కురిపించుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండలు కూడా మంచి సన్నిహితంగా ఉంటారు. ఎన్నో సందర్భంగా వీరిద్దరు ఒకరిపై ఒకరు అభిమానం చాటుకున్నారు.

కాగా అల్లు అర్జున్‌ హీరో, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కిస్తున్న పుష్ప 2 డిసెంబర్‌ 5న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇందులో బన్నీ సరసన నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌, రష్మిక, నిర్మాతలు ఇతర మూవీ టీం సభ్యులు పుష్ప 2 ప్రమోషన్స్‌లో భాగంగా ఇండియాలో ప్రధాన నగరాలన్ని చూట్టేస్తున్నారు. ఇప్పటికే చెన్నై, కొచ్చి గ్రాండ్‌ ఈవెంట్స్‌ నిర్వహించారు. ట్రైలర్‌ ఈవెంట్‌లో నార్త్‌లో నిర్వహించిన ఉత్తారాది ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారు. ఇవాళ శుక్రవారం ముంబైలో పుష్ప 2 టీం ప్రెస్‌మీట్‌కు హాజరుకానుంది. ఇక విజయ్‌ దేవరకొండ విషయానికి వస్తే చివరిగా ఖుషి సినిమాతో అలరించిన అతడు ప్రస్తుతం VD12 అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Exit mobile version