Vijay Devarakonda : టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే.
పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు.
అయితే ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమా గొప్ప హిట్ అవుతుందని భావించినప్పటికి ఇది డిజాస్టర్ గా నిలిచింది.
చాలామంది ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎందుకంటే బాలీవుడ్ బడా నిర్మాత అయిన కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించారు.
కానీ అనుకోని రీతిలో ఈ మూవీ డిజాస్టర్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చింది.
కాగా విజయ్ కి లైఫ్ ఇచ్చిన సినిమా అర్జున్ రెడ్డి అయితే.. 2018లో కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘గీత గోవిందం’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిలింలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.
ముఖ్యంగా విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ తరుణంలోనే ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానున్నట్లు తెలుస్తుంది.
మళ్ళీ కలిసిన హిట్ కాంబో.. విజయ్ దేవరకొండ – పరశురామ్ ..
తాజాగా విజయ్ దేవరకొండ మరోసారి దర్శకుడు పరశురామ్ తో చేతులు కలపబోతున్నాడు.
ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ దిల్ రాజు, విజయ్, పరశురామ్ తో ఉన్న ఫోటోని షేర్ చేశాడు.
సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తాము ఎదురు చూస్తూ ఉండండి అంటూ ట్వీట్ చేశాడు.
దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. పరశురామ్ – విజయ్ కాంబినేషన్ మళ్ళీ హిట్ కొడతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Very happy to announce that we are collaborating with blockbuster combination of The #VijayDeverakonda @TheDeverakonda & @ParasuramPetla for our upcoming film. 💥💥💥
Stay tuned for more updates… pic.twitter.com/WQfyhPFXS5
— Sri Venkateswara Creations (@SVC_official) February 5, 2023
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత జోడీగా “ఖుషి” సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగ భాగం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ త్వరలోనే తిరిగి సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇటీవలే సమంత ఆరోగ్యం ఇప్పుడు మెరుగు పడడంతో ఆమె తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటుంది.
ఇక ఈ మూవీతో పాటు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాకి విజయ్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
ఈ చిత్రంతో విజయ్ మొదటిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం అందుతుంది.
కాగా పరశురామ్ ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీ తెరకెక్కించాడు.
కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. అయితే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఈ సినిమా రాణించలేకపోయింది.
చూడాలి మరి.. ఫ్లాప్ లతో ఉన్న పరశురామ్, విజయ్ మళ్ళీ హిట్ కొట్టి గట్టెక్కుతారో లేదో అని
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/