Victory Venkatesh: దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రి లోకి వచ్చారు “దగ్గుబాటి వెంకటేశ్”.
తన కెరీర్ లో ఎన్నో హిట్లు, మరెన్నో రికార్డులను నెలకొల్పుతూ స్టార్ హీరోగా ఎదిగారు.
1986 లో కలియువ పాండవులు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మన విక్టరీ వెంకటేశ్ .. గత ఏడాది వచ్చిన ‘ఎఫ్ 3’ సినిమా వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా వెంకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్ లో, మహిళల్లో ఉన్న ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
తనదైన నటనతో, కామెడితో ప్రేక్షకులను కట్టిపడేయగలరు వెంకటేశ్. క్లాస్, మాస్, ఫ్యామిలీ, కామెడీ ఇలా అన్నీ జోనర్ల లోనూ తన టాలెంట్ ని నిరూపించుకున్నారు వెంకటేశ్.
ఇక లవ్ సినిమాలకు వెంకటేశ్ సినిమాలు పెట్టింది పేరుగా నిలిచాయి.
ఇక ఇప్పుడు ఆయన కెరీర్ లో 75 వ సినిమాలో నటించనున్నారు వెంకటేశ్.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు వెంకీ.
శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
‘సైంధవ్’ అనే టైటిల్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఈరోజు 11:07 నిమిషాలకు టైటిల్ అనౌన్స్ చేస్తూ రెండు నిముషాలు నిడివి ఉన్న గ్లింప్స్ ని రిలీజ్ చేశారు.
ఆ వీడియో గ్లింప్స్ లో.. ఒక పోర్ట్ ఏరియాలో వెంకటేష్ నడుచుకుంటూ వెళ్లి.. బైక్ మీద ఉన్న బాక్స్ లో నుంచి కెమికల్ బాంబు ఒకటి తీసి చూస్తాడు. ఆ తరువాత వెపన్స్ ఉన్న కంటైనర్ లోకి వెళ్లి గన్ తీసుకోని బయటకి వచ్చి బైక్ మీద కూర్చొని డైలాగ్ చెబుతాడు. ‘నేను ఇక్కడే ఉంటాను. ఎక్కడికి వెళ్ళాను, రమ్మను’ అని ముందు కొట్టిపడేసిన రౌడీలకు చెబుతాడు.
ఇక ఈ టీజర్ చూస్తుంటే గ్యాంగ్ వార్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. గడ్డంతో కనిపించిన వెంకీ మాస్ అవతార్ అభిమానులను థ్రిల్ చేస్తోంది. ఈ మధ్య అన్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తున్న వెంకటేష్.. చాలా కాలం తర్వాత ఈ మూవీలో సీరియస్ లుక్‌లో పవర్-ప్యాక్డ్ రోల్ పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా గూస్ బంప్స్ ఇస్తోంది.
ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్నట్లు గ్లింప్స్ లో తెలియజేశారు.
అలాగే త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ వీడియోతో ఒక్కసారిగా సినిమా పై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు.. తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/