Upcoming Releases : సమ్మర్ బరిలో ఈ సారి పోటీకి చిన్న సినిమాలు సై అంటున్నాయి. ఈ వారం అయితే తెలుగు సినిమాలతో పాటు, డబ్బింగ్ చిత్రాలూ కూడా అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలోనే బాక్సాఫీస్ వద్ద ఈ వారం సందడి చేయనున్నసినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
అన్నీ మంచి శకునములే..
ఈ వేసవిలో కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రమిది. యువ నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేసవిలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఓ పది రోజులు గడిపి వస్తే ఆ జ్ఞాపకాలు ఎలాంటి హాయిని పంచుతాయో అలాంటి మూవీ అని చిత్ర బృందం చెబుతోంది.
బిచ్చగాడు 2..
‘బిచ్చగాడు’ సినిమాతో తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నారు హీరో విజయ్ ఆంటోని. ఇప్పుడాయన ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు-2’ని సిద్ధం చేశారు. ఆయన హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా చేస్తుంది. ఈ సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగంలో రెండు కోణాలున్న పాత్ర పోషించిన ఆయన.. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసినట్లు అర్థమవుతోంది. ఈసారి యాక్షన్‌తో పాటు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం.
ఫాస్ట్ – x..
ప్రపంచ వ్యాప్తంగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్ కి ఉన్న అభిమాన సముద్రం గురించి తెలిసిందే. కార్లతో దుమ్ము రేపే పోరాటాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను సీటు అంచులకు తీసుకొచ్చే ఈ సిరీస్‌పై ఆడియన్స్ కి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో రాబోతున్న చిత్రం ‘ఫాస్ట్ ఎక్స్’. జస్టిన్ లిన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విన్ డీజిల్ మళ్ళీ మెయిన్ లీడ్ గా చేస్తుండగా.. జేసన్ మొమోవా విలన్ గా అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇది రెండు భాగాలుగా రానుంది. వీటిలో మొదటి భాగమైన ‘ఫాస్ట్ ఎక్స్’ 2023 మే 19న విడుదల కానుంది.
ఈ వారం ఓటీటీ వేదికగా విడుదలయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్‌లు (Upcoming Releases)..
డిస్నీ+ హాట్‌స్టార్..
డెడ్ పిక్సెల్స్ : వివాహానంతరం నిహారిక కొణిదెల ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్‌తో నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వైవా హర్ష, అక్షయ్ లింగుస్వామి, సాయి రోణక్ తదితరులు ప్రధాన పాత్రలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడియో గేమ్‌లకు యువత ఎంతగా ప్రభావితమవుతుందో ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్టు తెలుస్తుంది.
నెట్‌ఫ్లిక్స్..
అయాలవాషి (మలయాళం)మే 19
కథల్ (హిందీ) మే 19
బయీ అజైబి (ఇంగ్లీష్) మే 19
మ్యూటెడ్ (ఇంగ్లీష్) మే 19
నామ్ (సీజన్-2) మే 1
సోనీ లివ్..
ఏజెంట్ : అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil) నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’(Agent). భారీ అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు సోనీలివ్ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయిక. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు.
కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) మే 19
అమెజాన్ ప్రైమ్ వీడియో..
మోడ్రన్ లవ్ చెన్నై (తమిళ్) మే 18